- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంటి భోజనంతోనే ఇంత అందం : మసాబా గుప్తా
దిశ, సినిమా : డిజైనర్ కమ్ యాక్టర్ మసాబా గుప్తా.. గత పదేళ్లలో మొదటిసారి నాజూకైన శరీరాకృతిని పొందింది. చాలా కాలంగా పీసీఓడీ(పాలిసైటిక్ ఓవరీ సిండ్రోమ్) సమస్యతో బాధపడుతున్న తను ఆ సమస్యను ఏవిధంగా అధిగమించిందో చెప్తూ, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పిక్చర్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫొటోలో స్పోర్ట్స్ బ్రా, షార్ట్స్ ధరించిన మసాబా.. అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకుంటోంది. చూస్తుంటే భారీగానే వెయిట్ లాస్ అయిన బాలీవుడ్ డిజైనర్.. ఎలా సాధ్యమైందో వివరించింది. ‘నా బిజినెస్, రిలేషన్‌షిప్స్ కంటే కూడా హెల్త్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా. ఇది ప్రతీరోజు మీకోసం మీరు చేయాల్సిన పని. జీవితంలో ఫిట్‌నెస్ విషయంలో రాజీపడకుండా ఉంటేనే మంచి ఫలితాలు వస్తాయి’ అంటూ క్యాప్షన్ యాడ్ చేసింది.
ఇక తను వెయిట్ తగ్గేందుకు క్రమంతప్పకుండా ఉదయం 7-9 గంటల వరకు చేసే వర్కవుట్/యోగా/వాకింగ్‌తో పాటు వీక్ డేస్‌లో అవుట్‌సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసినట్టు తెలిపింది. స్వచ్ఛమైన ఇంటి భోజనంతోనే ఇది సాధ్యమైందని వెల్లడించింది. అంతేకాదు లేట్ నైట్ పార్టీలు, ఒత్తిడి, ఫోన్ కాల్స్ ఇవేవీ తనను తన రెగ్యులర్ వర్కవుట్స్ నుంచి దూరం చేయలేవని పేర్కొంది. ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్.. పీసీవోడీ ప్రాబ్లమ్ నుంచి బయటపడేందుకు సాయపడ్డట్టు వివరించింది.