నెలకు 10 వేల వెంటిలేటర్లే లక్ష్యంగా మారుతీ !

by Harish |   ( Updated:2020-03-28 08:11:46.0  )
నెలకు 10 వేల వెంటిలేటర్లే లక్ష్యంగా మారుతీ !
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దేశీయ అతిపెద్ద వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ సిద్ధమైంది. ప్రభుత్వానికి సాయంగా ఇప్పటికే దేశీయ దిగ్గజ ఆటో కంపెనీ మహీంద్రా మహీంద్రా తక్కువ ధరకే వెంటిలేటర్లను సిద్ధం చేయగా, మారుతీ సుజుకీ సైతం వాటి కొరత తీర్చేందుకు ముందుకొచ్చింది. వెంటిలేటర్లను, మాస్కులను తయారూ చేసేందుకు ఆగ్వా హెల్త్‌కేర్ సంస్థతో సంయుక్తంగా పని సిద్ధమైనట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత ఉన్న కారణంగా వ్యాధి నుంచి ప్రజలను విజయవంతంగా రక్షించేందుకు నెలకు 10,000 యూనిట్ల వెంటిలేటర్లను తయారు చేసే లక్ష్యంతో ఉన్నట్టు ప్రకటించింది.

మారుతీ సుజుకీ తయారు చేసే వెంటిలేటర్లకు ఆగ్వా హెల్త్‌కేర్ సంస్థ టెక్నాలజీని ఇవ్వనుంది. ప్రస్తుతం దేశీయంగా డిమాండ్‌ను బట్టి అధునాతనమైన, నాణ్యత కలిగిన వెంటిలేటర్స్ తయారు చేయనున్నట్టు సంస్థ స్పష్టం చేసింది. ఈ పరికరాల తయారీ కోసం అవసరమైన సొమ్ము, ప్రభుత్వ అనుమతులు అన్నింటిని మారుతీ సుజుకీనే భరించి ఆగ్వా హెల్త్‌కేర్‌కు ఉచితంగానే ఇవ్వనుంది. అలాగే, ఎంఎసైఎల్ అశోక్ కపూర్, కృష్ణ మారుతీ ఇండియా కలిసి మూడు పొరలతో ఉన్న మాస్కులను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని కేంద్ర ప్రభుత్వానికి సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అశొక్ కపూర్ భారత్ సీట్స్ లిమిటెడ్ కలిసి వైరస్ నుంచి రక్షణగా ఉండే సుమారు 20 లక్షల మాస్కులను తయారు చేయనున్నట్టు ప్రకటించారు.

Tags : Coronavirus, Coronavirus Pandemic, Coronavirus In India, Maruti Suzuki India Ltd, Bharat Seats Limited, Mahindra And Mahindra, AgVA Healthcare, Ventilators

Advertisement

Next Story

Most Viewed