మారుతీ సుజుకి 2 లక్షల ఆన్‌లైన్ విక్రయాలు

by Harish |
మారుతీ సుజుకి 2 లక్షల ఆన్‌లైన్ విక్రయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇప్పటివరకు ఆన్‌లైన్ ద్వారా 2 లక్షల కార్లను తమ సంస్థ విక్రయించిందని దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా సోమవారం వెల్లడించింది. రెండేళ్ల క్రితం మారుతీ తన ఆన్‌లైన్ సేల్స్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం సంస్థ దేశవ్యాప్తంగా 1,000 డీలర్‌షిప్‌లను కలిగి ఉంది. ‘2018లో కొత్తగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాం. 2019, ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఆన్‌లైన్ విక్రయాలు మూడు రెట్లు పెరిగి 2 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అలాగే, ఆన్‌లైన్ ద్వారా 21 లక్షలకు పైగా కస్టమర్ ఎంక్వైరీలను నిర్వహించామని’ మారుతీ సుజుకి ఇండియా సేల్స్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ చెప్పారు.

ఆన్‌లైన్ ద్వారా, డిజిటల్ ఎంక్వైరీలను సౌకర్యవంతంగా నిర్వహించగలిగితే ఆన్‌లైన్ అమ్మకాలు మెరుగ్గా ఉంటాయని తెలుస్తోందని శ్రీవాస్తవ వివరించారు. మారుతీ సుజుకి 2017 నుంచి ఆన్‌లైన్ బుకింగ్‌లను తీసుకుంటోంది. కస్టమర్లకు ఆన్‌లైన్ విక్రయం పట్ల ఆసక్తి పెరగడంతో డీలర్‌షిప్ వెబ్‌సైట్లులో ట్రాఫిక్ పెరిగిందని కంపెనీ వెల్లడించింది. ‘డిజిటల్ వేదిక మొత్తం అమ్మకాల్లో ఐదు రెట్లతో 20 శాతానికి పెరగడంతో సానుకూలంగా ఉన్నాం. ప్రస్తుత కరోనా వ్యాప్తి సమయంలో ఆన్‌లైన్ ద్వారా వాహనాలకు సంబంధించి విచారణలు ఐదు నెలల్లో 33 శాతానికి పెరిగాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed