- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుజుకీ నుంచి సరికొత్త ‘సెలెరియా’ కారు..
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన సరికొత్త సిరీస్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ‘సెలెరియా’ను బుధవారం భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ధర రూ.4.99 లక్షల నుంచి రూ.6.94 లక్షల మధ్య(ఎక్స్‌షోరూమ్) నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. మాన్యూవల్ వేరియంట్ ధర రూ.4.99-6.44 లక్షల మధ్య ఉండగా, ఆటోమేటిక్ వేరియంట్ రూ.6.13-6.94 లక్షల మధ్య ఉంది. సరికొత్త ‘సెలెరియో’ ప్రస్తుతం భారత రోడ్లపై ఉన్న మోడల్ కంటే పెద్దదని, అప్‌డేట్ చేసిన ఇంజిన్‌తో పాటు అత్యాధునిక భద్రత, సౌకర్యవంతమైన ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చినట్టు కంపెనీ తెలిపింది.
కొత్త సెలెరియోలోని ఇంజిన్ ద్వారా లీటర్‌కు 26.68 కిలోమీటర్ల మైలేజీ లభిస్తుందని, దేశంలోనే అత్యంత సమర్థవంతమైన పెట్రోల్ కారుగా సెలెరియో ఉందని మారుతీ సుజుకి ఓ ప్రకటనలో పేర్కొంది. ‘ప్రపంచంలోనే భారత్ ఐదో అతిపెద్ద కార్ల మార్కెట్‌గా ఉంది. మారుతీ సుజుకి దేశీయ మార్కెట్లో సగం వాటాను కలిగి ఉండటం గర్వంగా ఉంది. భారత వృద్ధికి మరింత తోడ్పాటునందించేందుకు కట్టుబడి ఉన్నామని’ మారుతీ సుజుకి మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ కెనిచి అయుకవా అన్నారు. కొత్త సెలెరియో మొత్తం 6 రంగుల్లో లభిస్తుందని, టెలిఫోన్ కంట్రోల్ స్టీరింగ్, ఆల్‌లాక్ ఇంటీరియర్, డిజిటల్ రీవ్ కవర్,7-అంగుళాల స్మార్ట్‌ప్లే లాంటి పూర్తిగా అత్యాధునిక ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.