- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మారుతీ సుజుకి భారీ రీకాల్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ కార్ల కంపెనీ మారుతీ సుజుకి భారీ సంఖ్యలో తన పాపులర్ మోడల్ కార్లను డీలర్‌షిప్‌లకు తీసుకురావాలని వినియోగదారులను కోరుతున్నట్లు వెల్లడించింది. ఫ్యుయెల్ పంప్‌లో ఏర్పడ్డ లోపాలను గుర్తించి వ్యాగన్ ఆర్, బలెనో మోడళ్లను రీకాల్ చేస్తున్నట్టు బుధవారం ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇటీవల ఇంధన పంపులో లోపాలు ఉన్నాయని వాహనదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని, దీంతో ఉచితంగా లోపాలను సరిదిద్ది వాహనదారులకు తిరిగివ్వనున్నట్టు మారుతీ సుజుకి ప్రకటించింది. ఈ రెండు మోడళ్లలో మొత్తం 1,34,885 యూనిట్లను స్వచ్ఛందంగా రీకాల్ చేయనున్నట్టు కంపెనీ స్పష్టం చేసింది. 2018, నవంబర్ నుంచి 2019, అక్టోబర్ మధ్య తయారు చేసిన 56,663 వ్యాగన్-ఆర్ కార్లను, 2019, జనవరి నుంచి 2019, నవంబర్ మధ్య కాలంలో తయారైన 78,222 కార్లను రీకాల్ చేస్తామని వెల్లడించింది. తయారీలోనే లోపాలుండటంతో వాహనదారులకు అదనపు ఖర్చు లేకుండా కంపెనీయే దీన్ని భరిస్తుందని కంపెనీ తెలిపింది. ఇదివరకు మోటర్ జనరేటర్ యూనిట్‌లో లోపాలున్నాయని గత డిసెంబర్‌లో ప్రీమియం మోడల్ సియజ్, ఎర్టిగా, ఎక్స్ఎల్6 63,493 యూనిట్లను, ఆగష్టులో 40,618 యూనిట్ల వ్యాగన్-ఆర్ కార్లను కంపెనీ రీకాల్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఇప్పటి వరకు అతిపెద్ద రీకాల్ జనరల్ మోటార్స్ 2015, జులైలో తన చిన్న కారు బీట్ మోడల్ 1.7 లక్షల యూనిట్లను రీకాల్ చేసింది. దీని తర్వాత ఫోర్డ్ అత్యధికంగా 2013లో 1.65 యూనిట్లను వెనక యాక్సిల్, పవర్ స్టీరింగ్‌లో లోపాల కారణంగా రీకాల్ చేసింది. వీటి తర్వాత మారుతీ సుజుకినే అత్యధిక కార్లను రీకాల్ చేస్తోంది. మొత్తంగా, ఫోర్డ్ కంపెనీ గత 15 ఏళ్లలో ఇండియాలోని 3 లక్షల కార్లను రీకాల్ చేసింది.