నాని, మారుతి కాంబినేషన్ రిపీట్

by Shyam |   ( Updated:2020-08-03 01:43:15.0  )
నాని, మారుతి కాంబినేషన్ రిపీట్
X

అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా ఎదిగిన టాలీవుడ్ యంగ్ హీరో నాని. నేచురల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నాని ఎలాంటి పాత్రనైనా ఈజీగా తనదైన స్టైల్‌లో చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. పైగా, తన చిత్రాలలో కొత్తదనం ఉండేలా చూసుకుంటాడు. ప్రస్తుతం ఓ పక్క ‘వి’, మరోపక్క ‘టక్ జగదీశ్’ చిత్రాల్లో నటిస్తున్న నాని.. టాలెంటెడ్ దర్శకుడు మారుతితో మరో చిత్రాన్ని చేయడానికి అంగీకరించినట్లు తాజా సమాచారం.

కొన్నాళ్ల కిందట నాని, మారుతి కాంబినేషన్‌లో ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఏ స్థాయిలో విజయం సాధించిందో తెలిసిందే. ఈ క్రమంలోనే మారుతితో మరో సినిమా చేయాలని నాని ఇప్పటిదాకా భావిస్తూ వచ్చాడు. అయితే, ఇన్నాళ్లకు కథ సెట్ అయినట్లు చెబుతున్నారు. తాజాగా మారుతి వినిపించిన కథ నచ్చడంతో నాని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం మారుతి పూర్తి స్క్రిప్టును సిద్ధం చేసే పనిలో ఉండగా.. ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా రూపొందించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story