మారుతీ సుజుకి గుడ్ న్యూస్.. మార్కెట్లోకి ఎక్కువ సంఖ్యలో సీఎన్‌జీ కార్లు

by Harish |   ( Updated:2021-11-14 04:20:55.0  )
మారుతీ సుజుకి గుడ్ న్యూస్.. మార్కెట్లోకి ఎక్కువ సంఖ్యలో సీఎన్‌జీ కార్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతి పెద్ద ప్యాసింజర్ వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకి తన ఉత్పత్తుల్లో సీఎన్‌జీ కార్ల సంఖ్యను మరింత పెంచాలని భావిస్తోంది. గత కొంతకాలంగా ఇంధన ధరలు పెరుగుతుండటం, డీజిల్ కార్ల అమ్మకలు పడిపోతున్న కారణంగా సీఎన్‌జీ కార్ల దీర్ఘకాలంలో గిరాకీ ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దాదాపు 1.62 లక్షల సీఎన్‌జీ కార్లను విక్రయించింది. రానున్న రోజుల్లో మరిన్ని మోడళ్లతో విస్తరణ పెంచేందుకు సిద్ధమవుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3 లక్షల సీఎన్‌జీ యూనిట్లను అమ్మాలనుకుంటున్నాం. ప్రస్తుతం ఈ విభాగంలో ఎక్కువ మోడళ్లు లేవు. కేవలం 7 మాత్రమే అందుబాటులో ఉన్నాయని మారుతీ సుజుకి సేల్స్, మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ అన్నారు. మరిన్ని కొత్త మోడళ్లను తీసుకురావడం ద్వారా రాబోయే సంవత్సరాల్లో సీఎన్‌జీ అమ్మకాలు పెరుగుతాయని ఆయన తెలిపారు. కాగా, మారుతీ సుజుకి హరియానాలో తన కొత్త ప్లాంట్‌ను త్వరలో ఏర్పాటు చేయనుంది. సోనీపత్ ప్రాంతంలో 900 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేయనున్నట్టు, దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి ఇచ్చినట్టు హరియానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖటర్ చెప్పారు. దేశీయ ఆటో పరిశ్రమంలో మరింత వేగంగా పుంజుకునేందుకు ఈ కొత్త ప్లాంట్ తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. 15 ఏళ్లకు రీయంబర్స్‌మెంట్ వెసులుబాటుకు ప్రభుత్వం అంగీకరించింది.

Advertisement

Next Story