మారుతీరావుతో విభేదాలు లేవు: సోదరుడు శ్రవణ్

by Sumithra |
మారుతీరావుతో విభేదాలు లేవు: సోదరుడు శ్రవణ్
X

దిశ నల్లగొండ: ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొదటిసారిగా ఆయన సోదరుడు శ్రవణ్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. తన సోదరుడు మారుతీరావుతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, అదంతా మీడియా సృష్టేనని శ్రవన్ అన్నారు.
ప్రణయ్ హత్య కేసులో అనవసరంగా తాను ఇరుక్కోవడం, ఆ తరువాత కుటుంబ సభ్యులకు దూరమమ్యడంతోనే మారుతీరావుతో మాట్లాడటం లేదు అన్న మాట వాస్తవమేనని శ్రవణ్ పేర్కొన్నారు. మారుతీరావుతో చివరిసారిగా గత సంవత్సరం మే 15న మాట్లాడానని అన్నారు. మిర్యాలగూడలోని తన సోదరుడి షెడ్‌లో దొరికిన గుర్తు తెలియని మృతదేహంతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. సోదరుడు చనిపోయిన విషయం కారు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పడంతో వెంటనే వదినను తీసుకొని హైదరాబాద్ వచ్చినట్లు శ్రవణ్ తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన సోదరుడు రాసిన సూసైడ్ నోట్‌లో ఏముందన్న విషయం తనకు తెలియదన్నారు. పోలీసులు సైతం ఆ విషయాన్ని తమకు చెప్పలేదని పేర్కొన్నారు.

Advertisement

Next Story