- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోరిక తీర్చాలంటూ బావ వేధింపులు.. మనోవేదనతో మరదలు సూసైడ్
దిశ, కరీంనగర్ సిటీ: ఆపదలో ఆదుకున్న బావ ఆ తర్వాత కాల యముడయ్యాడు. ఇచ్చిన రూ. 10 వేలకు రూ. 30 వేలు ఇవ్వు, లేదా నా కోరిక తీర్చు అంటూ మరదలును వేధించాడు. ఆ వేధింపులు తాళలేక బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది.
ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
కరీంనగర్‌లోని కాపువాడలో ముంజం అరుణ అనే వివాహిత తన కుటుంబంతో నివాసముంటుంది. భర్త గుమస్తాగా పనిచేస్తుండగా, ఆమె టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. వీరి ఇంటికి సమీపంలోనే వరుసకు బావ అయిన ముంజం కనకయ్య సెటిల్ అయ్యాడు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న ఆయన కరోనా సమయంలో అరుణ కుటుంబానికి కొంత మొత్తం డబ్బులు ఇచ్చినట్లు తెలుస్తుంది. దానిని ఆసరాగా చేసుకుని తరచూ ఇంటికి వస్తూ, అరుణను లైంగికంగా వేధిస్తుండటంతో ఎవరికి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోతో పాటు సూసైడ్ నోట్‌లో పేర్కొంది.
పరువుగా బతికే తన కుటుంబంపై పిల్లలకు తప్పుగా చెబుతానంటూ బెదిరింపులకు గురిచేస్తున్నట్లు వాపోయింది. మిషిన్ కుట్టుకుంటూ పిల్లలను పోషించుకుంటున్నా తనపై అబాండాలు వేయటం భరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్ని రకాలుగా భయపెట్టినా లొంగడం లేదని చివరకు తనకు రూ.30 వేలు ఇవ్వాలని బయట చెబుతున్నాడని, పరువు పోతుందన్న మనోవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ వీడియోలో కన్నీరు పెట్టుకుంది.