- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొడిగిస్తే కష్టం.. లేకుంటే మీ ఇష్టం!
దిశ, మెదక్: వివాహాలకు కరోనా లాక్‌డౌన్‌తో కట్టడి చేస్తోంది. వివాహాల ముహూర్తాలకు సిద్ధమైన కుటుంబాలు కరోనా కారణంగా పెళ్లిళ్లు సైతం వాయిదా వేసుకుంటున్నారు. మే నెలలో శ్రావణ మాసంలో శుభకార్యాలకు మంచి ముహూర్తం ఉంది. కానీ, కరోనా లాక్‌డౌన్ కారణంగా జరగాల్సిన శుభకార్యాలు వాయిదా వేయకతప్పటంలేదు. రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మే 7 వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. కానీ, ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవలం 14 కేసులే నమోదు కావడం .. ఇందులో నలుగురు డిశ్చార్జ్ కావడం జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా వ్యాప్తి లేకున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతున్న దృష్ట్యా పెళ్లిళ్లను మాత్రం వాయిదా వేయాల్సి వచ్చింది. మే నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగిస్తే శ్రావణ మాసం వరకూ ముహూర్తాల కోసం ఆగాల్సిందే.
డిమాండ్ పెరిగే అవకాశం…
జూలై, ఆగస్టుల్లో తక్కువగా ఉన్న ముహూర్తాలకు పెళ్లిళ్లు పెట్టుకుంటే కళ్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, కేటరింగ్, డెకరేషన్, లైటింగ్, బ్యాండ్, మ్యారేజ్ ఈవెంట్ నిర్వాహకులకు మరింత డిమాండ్ ఏర్పడనున్నది. ఒకవేళ లాక్ డౌన్ మే 1వ తేదీ వరకు ఎత్తేస్తే అనుకున్న ముహూర్తాలకు పెళ్లిళ్లు జరిగే అవకాశముంది. కరోనా దెబ్బకు శుభలేఖలు పంచిన వారు తప్పని పరిస్థితుల్లో హంగు, ఆర్భాటాలు లేకుండా దేవాలయాల్లో పది, ఇరవై మందితో మమ అనిపించారు. కళ్యాణ మండపాలు, హోటళ్లు, ఫంక్షన్‌హాళ్లు, కేటరింగ్, డెకరేషన్, లైటింగ్, బ్యాండ్, మ్యారేజ్ ఈవెంట్ నిర్వాహకులకు అడ్వాన్సులు చెల్లించేశారు. అవి తిరిగి వస్తాయా లేదా అన్న ఆందోళన మొదలైంది.
ఉపాధికి దెబ్బ…
వివాహాలు వాయిదా పడుతుండడంతో విభిన్న రంగాలవారిపై తీవ్ర ప్రభావం పడుతోంది. పురోహితులు, ఫంక్షన్‌హాల్ యజమానులు, ఫొటో, వీడియోగ్రాఫర్, పెళ్లి పందిరి వేసే వాళ్లు, డెకరేషన్, సౌడ్, టెంట్‌హౌలు, డీజేలు, బ్యాండ్ మేళా ఇలా చాలామందికి ఉపాధి లేకుండా పోయింది.
tags: Medak, Corona Effect, Marriage, Fetal, Postponed