- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమెరికాలో bigg boss 5 సన్నీ స్వప్నలోక సుందరి.. ఆనందంలో ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్ : బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ సన్నీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ హౌస్‌లో తన కామెడీతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక సన్నీ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పాలి. లేబుల్ లేవు .. మచ్చా అంటూ తన మాటలతో రెండు తెలుగు రాష్ట్ర ప్రజల మనసులో స్థానం సంపాదించుకున్నాడు సన్నీ. అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక ఏ కంటెస్టెంట్‌కు అయినా సినిమా ఆఫర్స్, యాంకరింగ్ అవకాశాలు వస్తుంటాయి. కానీ సీజన్ 5 బిగ్ బాస్ హౌస్ కామెడీ స్టార్ సన్నీకి మాత్రం ఏకంగా పెళ్లి ఆఫర్ వచ్చిందంట.
స్వప్నలోక సుందరి కోసం హౌస్‌లో అడుగు పెట్టిన సన్నీకి పాపం హౌస్‌లో స్వప్నలోక సుందరి కనిపించక పోయినా.. హౌస్ నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆఫర్ రూపంలో ఎదురు పడింది అంటున్నారు ఈ వార్త విన్న కొందరు. అయితే ఒక ఆంటీ సన్నీకి కాల్ చేసి నాకుతురును చేసుకుంటావా.. నీకు కట్నంగా 100 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చిందంట అమెరికా ఆంటీ. ఇది సరదాగా తీసుకున్న సన్నీ ‘నన్ను భరించాలంటే చాలా ఓర్పు ఉండాలి .. మీరు ఆ మాట అన్నారు చాలు’ అంటూ థాంక్స్ ఫీల్ తో ఆన్సర్ చెప్పాడు. కానీ ఆ ఆంటీ ఏకంగా ఇది జోక్‌గా కాదు నిజంగానే అడుగుతున్నాను అంటూ సంబంధం మాట్లాడిందంట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సన్నీకి మ్యారేజ్ ప్రపోజల్ రావడంతో సన్నీ అన్న స్వప్నలోక సుందరి దొరికేసింది అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.