మంటల్లో కాలుతూ లవ్ ప్రపోజ్!

by Shyam |
మంటల్లో కాలుతూ లవ్ ప్రపోజ్!
X

ప్రేయసి మీద తమకున్న ప్రేమను పెళ్లి వరకు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ప్రపోజ్ చేయడమనేది ఒక కీలక మలుపుగా మారుతుంది. అందుకే ఆ ప్రపోజల్‌ను వీలైనంత విభిన్నంగా, ప్రత్యేకంగా ఉండేలా అబ్బాయిలు ప్లాన్ చేసుకుంటారు. కొన్నిసార్లు కేవలం ప్రపోజల్ చేసిన స్టైల్ నచ్చి అంగీకరించే గర్ల్‌ఫ్రెండ్స్ కూడా ఉంటారు. అందుకే కాదనడానికి వీలుకాని రీతిలో ప్రపోజ్ చేస్తారు. కాగా, అమెరికాలోని కెంట్ నగరంలో ప్రొఫెషనల్ స్టంట్‌మన్ రిక్కీ యాష్ తనదైన శైలిలో గర్ల్ ఫ్రెండ్ కత్రినాకు ప్రపోజ్ చేసిన విధానం ఆమెనే కాదు, వారి వీడియో చూసే వారందరికీ కొత్తగా అనిపిస్తోంది. నిజంగా మంటల్లో కాలినా ప్రేమ బతుకుతుందని రిక్కీ యాష్ నిరూపించే ప్రయత్నం చేశాడు. ఇంతకీ రిక్కీ ఏం చేశాడో తెలుసా?

స్వతహా స్టంట్‌మన్ అవడంతో రిక్కీ తనదైన విన్యాసంతో కత్రినాకు ప్రపోజ్ చేశాడు. శరీరానికి మంటలు అంటించుకుని, మోకాళ్ల మీద కూర్చొని ప్రపోజ్ చేశాడు. చిన్న పనుందని చెప్పి కత్రినాను తాను స్టంట్ చేసే స్పాట్‌కు తీసుకొచ్చాడు. క్యాజువల్ పని అనుకొని నర్సుగా పనిచేస్తున్న కత్రినా సాధారణ నర్సు డ్రెస్‌లోనే వచ్చింది. తర్వాత ఆమెను అలాగే నిలబెట్టి రిక్కీ మంటలు అంటించుకున్నాడు. మంటలు పెరుగుతూ ముఖం వైపుకు వస్తున్నా జేబులో చేయి పెట్టుకుని అలాగే కూర్చున్నాడు. అది చూసి షాక్ అయిన కత్రినా చేతులు తీయడానికి ప్రయత్నించినపుడు నవ్వుతూ జేబులో నుంచి రిక్కీ ఉంగరం తీశాడు. ఆమె వెంటనే ఓకే చెప్పగానే పక్కన ఉన్న నిపుణులు రిక్కీ మీది మంటలు ఆర్పేశారు. ఇలా ప్రమాదకరంగా ప్రపోజ్ చేసినందుకు ముందు కత్రినా కోప్పడినా తర్వాత అతన్ని కౌగిలించుకుని పెళ్లికి అంగీకారం చెబుతూ ముద్దు పెట్టుకుంది.

Advertisement

Next Story