ఇంగ్లాండ్ ఫుల్‌టైమ్ కోచ్‌గా ట్రెస్కోథిక్ ?

by Shyam |
ఇంగ్లాండ్ ఫుల్‌టైమ్ కోచ్‌గా ట్రెస్కోథిక్ ?
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ జట్టు తాత్కాలిక బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న మాజీ క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్ తన ఉద్యోగాన్ని ఫుల్‌టైమ్‌గా మార్చాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB)ని కోరినట్లు సమాచారం. ఇంగ్లాండ్ జట్టుతో పాటు ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ట్రెస్కోథిక్ ఈ మేరకు దరఖాస్తు చేసుకున్నాడని డైలీ మెయిల్ అనే పత్రిక కథనాన్ని వెలువరించింది.

ఈసీబీ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకోసం పూర్తి స్థాయి బ్యాటింగ్, వికెట్ కీపింగ్ కోచ్‌ల కోసం అన్వేషిస్తున్నది. పూర్తి స్థాయి బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న మార్క్ రాంప్రకాశ్ గత ఏడాది తన పదవికి రాజీనామా చేశాడు. అప్పటి నుంచి ట్రెస్కోథిక్ తాత్కాలిక కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. జోనాథన్ ట్రాట్, ఇయాన్ బెల్‌లు కూడా బ్యాటింగ్ కోచ్ పదవిని ఆశిస్తున్నారో. మరోవైపు జేమ్స్ ఫాస్టర్ వికెట్ కీపింగ్ కోచ్ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.

కాగా, ట్రెస్కోథిక్‌ను బ్యాటింగ్ కోచ్‌గా నియమించవద్దని పలు వైపుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం. 2008లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ట్రెస్కోథిక్ అంతకు ముందు తీవ్రమైన ఒత్తిడి కారణంగా మానసికంగా సమస్యలు ఎదుర్కొన్నాడు. ఈ కారణంగానే పలు సిరీస్‌లు కూడా ఆడలేదు. అలాంటి వ్యక్తిని కోచ్‌గా ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed