మెజీషియన్‌గా మారిన ఆ హీరోయిన్.. వీడియో వైరల్

by Shyam |   ( Updated:2021-10-21 05:38:30.0  )
మెజీషియన్‌గా మారిన ఆ హీరోయిన్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: నిత్యం సోషల్ మీడియాలో ఏదో ఒక విధంగా హల్ చల్ చేసే సినిమా తారల్లో మరాఠీ భామ ప్రియా బాపట్ కూడా ఒకరు. ఫిట్‌నెస్ వీడియోలు, డిఫరెంట్ ఫోటోస్‌ తో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను నింపేసే భామ.. తాజాగా మరో అమేజింగ్ వీడియో పోస్ట్ చేసి నెటిజన్ల అటెన్షన్ క్యాచ్ చేసింది. ‘ఇట్స్ మ్యాజిక్ టైమ్, ఫన్ టైమ్’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ కాగా.. తను ఇచ్చిన ట్విస్ట్‌కు నవ్వుకోక తప్పదు.

ఆరెంజ్‌ను నోటి ముందు ఎలాంటి ఆధారం లేకుండా నిలబెట్టి మ్యాజిక్ చేసిన ప్రియా.. ‘నువ్వు సూపర్’ అనే లోపే అసలు ట్విస్ట్ బయటపెట్టింది. అప్పటి వరకు స్ట్రెయిట్‌గా కనిపించిన భామ పక్కకు తిరిగే సరికి ఫోర్క్ సాయంతో ఆరెంజ్‌ను పట్టుకుందని తెలిసిపోతుంది. ఏదేమైనా వీడియోలో ఫ్రూట్‌ను నోటితో పట్టుకున్నట్లు కనిపించకుండా మేనేజ్ చేసిన ప్రియా.. మెజీషియన్స్ ట్రిక్స్ రివీల్ చేసేందుకు ఓ చిన్న ప్రయత్నం చేశానని తెలిపింది.

https://www.instagram.com/reel/CVQD2PNv-ce/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story