మావోల సానుభూతిపరులు అరెస్ట్

by Anukaran |   ( Updated:2020-08-29 10:21:43.0  )
మావోల సానుభూతిపరులు అరెస్ట్
X

దిశ, కాటారం: మహాముత్తారం మండలంలో మావోయిస్టు పార్టీ సానుభూతిపరులను పోలీసులు పట్టుకున్నారు. కాటారం డీఎస్పీ బోనాల కిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం..మహాముత్తారం ఎస్సై శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున సింగారం సమీపంలోని గుత్తికోయగూడెం వద్ద పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఐదుగురు అనుమానిత వ్యక్తులు తారసపడ్డారు. ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన మడుకం నందు, మహేష్, కమలేష్, లచ్చయ్య, లింగయ్యలు గత కొంతకాలంగా ఇక్కడే నివాసం ఉంటున్నారు. వారి వద్ద జిలిటెన్ స్టిక్స్, స్టీల్ టిఫిన్ డబ్బాలు, మావోయిస్టుల కరపత్రాలు లభ్యం అయ్యాయి. వీరు ఏటూరు నాగారం, మహదేవపూర్ ఏరియా మావోయిస్టు పార్టీ ఇంఛార్జి కంకణాల రాజిరెడ్డికి వీటిని సరఫరా చేస్తున్నారు. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచినట్టు డీఎస్పీ కిషన్ తెలిపారు. ఈ సమావేశంలో కాటారం సీఐ హథీరాం, ఎస్సై శ్రీనివాస్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed