విశాఖ ఉద్యమానికి మావోయిస్టుల మద్దతు

by srinivas |
Maoist party
X

దిశ, క్రైమ్ బ్యూరో: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపడుతున్న ఉధ్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని (సీపీఐ) మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో జగన్ మాట్లాడుతూ లాభాలతో నడుస్తున్న విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేట్ కంపెనీలకు అమ్మి గత 5 దశాబ్దాలుగా జీవనోపాథి పొందుతున్న వేలాధి కుటుంబాలను వీధుల పాలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో భావోద్వేగాలను, జాతి ఉన్మాదాన్ని రెచ్చగొట్టి బ్రాహ్మణీయ హిందూత్వ మతోన్మాద బీజేజీ ప్రభుత్వం, సంఘ్ పరివార్ శక్తులు పబ్బం గడుపుకుంటున్నట్టు ద్వజమెత్తారు.

దేశంలో అభివృద్ది చెందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలనే ప్రధాని మోడీ ప్రచారం చేయడం సిగ్గు చేటన్నారు. 2019 అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చి తరాలుగా జీవిస్తున్న ఆదివాసులను అడవి నుంచి గెంటివేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాచి కోల్ ఇండియా బొగ్గు బావులను అమ్మివేసి కార్మికులను నడి వీధిలో నెట్టివేసి నిరుద్యోగులను చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులకు, ప్రజలకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Next Story