- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శేషయ్య సార్ మరణం ఉద్యమాలకు నష్టమే
దిశ ప్రతినిధి, ఖమ్మం :
విప్లవ మేధావి, ప్రజాస్వామికవాది, పౌరహక్కుల ఉద్యమ నేత, ప్రజల శ్రేయోభిలాషి కామ్రేడ్ శేషయ్యసార్ మరణానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నామంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర రీజినల్ బ్యూరో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. పౌరహక్కుల నేత శేషయ్య సార్ మరణవార్త తమకు ఆలస్యంగా తెలిసినందుకు చింతిస్తున్నట్లు పార్టీ పేర్కొంది. శేషషయ్య సార్‌కు విప్లవ జోహార్లను అర్పిస్తున్నట్టు తెలిపింది. కామ్రేడ్ మరణంపై ఆయన కుటుంబానికి మిత్రులకు పార్టీ కేంద్ర కమిటీ తరుపున ప్రగాఢ సంతాపాన్ని తెలియ జేస్తున్నామని తెలిపింది. కొద్ది రోజులుగా శేషయ్యసార్(64) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ అక్టోబర్ 10న తుది శ్వాస విడిచారు. కాగా ఆయన మరణం దేశంలో విప్లవ, ప్రజాస్వామిక, ప్రగతిశీల ఉద్యమాలకు తీవ్రమైన నష్టమని పార్టీ తెలిపింది. ఆయన లేనిలోటు పూడ్చలేనిదని పార్టీ పేర్కొన్నది.