- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్: పచ్చని అడవుల్లో తుపాకీ కాల్పుల మోతలు ఆగడం లేదు. నెత్తుటి దారలు ఆరడం లేదు. రోజుకోచోట రక్తం చిందుతూనే ఉంది. తాజాగా మంగళవారం సాయంత్రం చత్తీస్ గఢ్‌లో ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా బాసగూడలో ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అంతకు ముందు పోలీసులే లక్ష్యంగా అమర్చిన మందుపాతరను మావోయిస్టులు పేల్చారు. ఆ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. తేరుకున్న పోలీసులు కాల్పులు జరపడంతో మావోయిస్టు హతమయ్యాడు. అనంతరం తనిఖీలు చేపట్టగా భారీగా పేలుడు పదార్ధాలు లభ్యమయ్యాయి. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పోలీసులు గోలకొండ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగిస్తున్నారు.
Advertisement
Next Story