పోలీసుల అదుపులో మావోయిస్ట్..?

by Sumithra |

దిశ, వరంగల్: మావోయిస్ట్ దళ సభ్యుల్లో ఒకరిని ములుగు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు వ్యక్తి కేకేడబ్ల్యూ మాజీ కార్యదర్శి, ప్రస్తుత ఏటూరునాగారం, మహదేవపూర్ ఏరియా ఇంఛార్జ్ బడే దామోదర్ అంగరక్షకుడిగా‌ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల కిందటే మావోయిస్ట్‌ను అదుపులోకి తీసుకున్న తాడ్వాయి పోలీసులు.. దామోదర్‌కు సంబంధించిన వివరాలను రాబట్టేందుకు విచారిస్తున్నట్లు సమాచారం. వారం రోజుల కిందట దామోదర్ నేతృత్వంలో తాడ్వాయి అడవుల్లోకి ప్రవేశించిన మావోయిస్టు దళం మద్దిమడుగు ప్రాంతంలో సేదతీరినట్లు ప్రచారం జరిగింది. దీంతో తాడ్వాయి పోలీసులు ప్రత్యేక బలగాలతో ఆ ప్రాంతానికి వెళ్లగా అప్పటికే మావోయిస్ట్‌లు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్ట్ దళ సభ్యుడొకరు పట్టుపడినట్లు సమాచారం.

Tags: Maoist, arrest, police, Tadvai foriest, warangal, ts news

Advertisement

Next Story