కేసీఆర్‌కు షాక్.. గులాబీ పార్టీకి ముఖ్య నేతల గుడ్ బై..

by Shyam |
కేసీఆర్‌కు షాక్.. గులాబీ పార్టీకి ముఖ్య నేతల గుడ్ బై..
X

దిశ ప్రతినిధి, వరంగ‌ల్ : టికెట్ రాద‌ని ప‌క్కా స‌మాచారం అందిన నేత‌లు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం నుంచి ఓరుగ‌ల్లు రాజకీయాల్లో ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక డివిజ‌న్లలో టీఆర్ఎస్ టికెట్ కోసం విప‌రీతంగా పోటీ నెల‌కొని ఉండ‌టంతో పార్టీ టికెట్ ఆశించి త‌మ‌కు రాద‌ని భావిస్తున్న నేత‌లు.. కాంగ్రెస్‌, బీజేపీతో పాటు గుర్తింపు పొందిన పార్టీల వైపు చూస్తున్నారు.

కాంగ్రెస్‌, బీజేపీల్లో చేరేందుకు అవ‌కాశాలుంటే వెంట‌నే జంప‌వుతున్నట్లుగా తెలుస్తోంది. 23వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించిన సతీష్ అనే నాయ‌కుడు.. తనకు టికెట్ రాద‌నే ప‌క్కా సమాచారంతో పార్టీని వీడారు. ఆయ‌న‌ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీలో చేరి పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

అలాగే తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని 32వ డివిజన్‌లోని టీఆర్ఎస్ పార్టీలో కీల‌క నేత‌గా ఉన్న సింగరి రాజ్ కుమార్ మంగ‌ళ‌వారం ఉద‌యం తన అనుచరులతో క‌ల‌సి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. టికెట్లు ఆశిస్తున్న తాజా మాజీల్లోని చాలామందికి అధిష్ఠానం నుంచి వ్యతిరేక సంకేతాలు అందుతుండ‌టంతో కొంత‌మంది పార్టీని వీడాల‌ని దాదాపుగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని కొంత‌మంది తాజా మాజీ కార్పోరేట‌ర్లు ర‌హ‌స్యంగా స‌మావేశ‌మైన‌ట్లుగా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed