- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒడిశాపై మోహన్ బగాన్ ఘన విజయం
X
పనాజీ: ఇండియన్ సూపర్ లీగ్(ఐఎస్ఎల్) 2020/21 సీజన్‌లో భాగంగా గోవాలోని జీఎంసీ స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఒడిశా ఫుట్‌బాల్ క్లబ్‌పై ఏటీకే మోహన్ బగాన్ జట్టు ఘన విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లూ బంతిని సమాన ఆధీనంలోనే ఉంచుకున్నప్పటికీ గోల్స్ చేయడంలో మాత్రం ఒడిశా జట్టు విఫలమైంది. మోహన్ బగాన్ ఆటగాళ్లు మన్విర్ సింగ్ (రెండు గోల్స్-11, 54వ నిమిషాల్లో) , రాయ్‌క్రిష్ణ (రెండు గోల్స్-83, 86వ నిమిషాల్లో) రాణించడంతో మ్యాచ్ ముగిసే సమయానికి జట్టు 4 గోల్స్ చేసింది. ఒడిశా జట్టులో అలెగ్జాండర్ (46వ నిమిషంలో) ఒక్కడే గోల్ చేశాడు. ఫలితంగా ఒడిశా ఎఫ్‌సీపై ఏటీకే మోహన్ బగాన్ జట్టు 4-1తో విజయం సాధించింది. మన్విర్ సింగ్ హీరో ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా, రాయ్ క్రిష్ణ డీహెచ్ఎల్ విన్నింగ్ పాస్ అవార్డు దక్కించుకున్నాడు.
Advertisement
Next Story