- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలకు వ్యాక్సిన్స్ ఇప్పించడంలో నిర్లక్ష్యం వద్దు..
దిశ, సినిమా : అప్‌కమింగ్ యాక్ట్రెస్ మానుషి చిల్లర్ యూనిసెఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించబడింది. ఏప్రిల్ 24-30 వరకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ సందర్భంగా పలు విషయాలపై అవగాహన కల్పించనుంది. ఇప్పటికే అమ్మాయిలు రుతుక్రమంలో పాటించాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రతపై వివరించిన మానుషి.. ఇప్పుడు చిన్నారులకు టీకాలు(వ్యాక్సిన్స్) ఇప్పించే విషయంలో అజాగ్రత్తగా ఉండరాదని హెచ్చరించింది.
వ్యాక్సిన్స్ ఎదిగే పిల్లల ఆరోగ్యాన్ని రక్షిస్తాయని.. పోలియో, తట్టు లాంటి భయంకరమైన వ్యాధులు రాకుండా కాపాడుతాయని వివరించింది. కొవిడ్ 19 ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని పిల్లల టీకాలపై నిర్లక్ష్యం చేయకూడదన్న ఆమె.. వ్యాక్సిన్స్ ఇప్పించేందుకు మన ప్రయత్నాన్ని రెట్టింపు చేద్దామని పిలుపునిచ్చింది. కరోనా వ్యాక్సిన్ గురించి ఎదురుచూస్తున్న మనం.. మన పిల్లల జీవితాలకు తీవ్రమైన ముప్పుగా ఉన్న అంటువ్యాధుల నుంచి రక్షించుకునేందుకు టీకాలు వేయించడాన్ని గుర్తుంచుకుందామని సూచించింది.