అప్రమత్తంగా ఉండండి: కరోనా తగ్గి.. డెంగ్యూ విస్తరిస్తోంది

by Sridhar Babu |   ( Updated:2021-08-11 05:34:14.0  )
Manuguru ZPTC narasinga rao
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు నియోజకవర్గంలో కరోనా తగ్గుముఖం పట్టి, డెంగ్యూ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని మణుగూరు జెడ్పీటీసీ పొశం నర్సింహారావు అన్నారు. బుధవారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు అప్పారావు అధ్యక్షతన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. నియోజవర్గంలో ప్రజలు కరోనా వల్ల ఎంతో ఇబ్బందులు పడ్డారని, కొన్ని కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా మరువక ముందే నియోజకవర్గ ప్రజలను డెంగ్యూ జ్వరాలు వెంటాడుతున్నాయని వెల్లడించారు. ప్రజలు డెంగ్యూ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు.

చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డెంగ్యూ జ్వరాలపై వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండి, మండలంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యంపై వైద్య అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. గ్రామ పంచాయితీల్లో సర్పంచ్లు, కార్యదర్శులు శానిటేషన్ చేపించాలన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రజల ఆరోగ్యం కోసం ఎంత ఖర్చైన చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు ముత్యంబాబు, యువజన అధ్యక్షులు హర్షనాయుడు, రుద్ర వెంకట్, మాజీ ఎంపీటీసీ రవి, తంతరపల్లి కృష్ణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed