- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యే శ్రీధర్ బాబు స్పెషల్ ఫోకస్.. ధన్వాడ ZP పాఠశాలకు మహర్ధశ
దిశ, కాటారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆదర్శవంతమైన పాఠశాలగా, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మండలంలోని స్వగ్రామమైన ధన్వాడలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శుక్రవారం ఘనంగా పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజులు ఇక్కడే మకాం వేశారు. శనివారం ధన్వాడ పరిధి గ్రామాల్లోని వాడలలో కాలినడకన పర్యటించారు.
ఈ సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి అదనపు గదులు నిర్మాణం, కంప్యూటర్లను ఏర్పాటు, ప్రత్యేక విద్యాబోధన కోసం తగిన ఏర్పాట్లు చేయడానికి ప్రణాళిక తయారు చేయనున్నట్లు పేర్కొన్నారు. ధన్వాడ పాఠశాలను ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్ది ఈ ప్రాంత విద్యార్థులు చదువులో రాణించేలా చర్యలు చేపడుతామన్నారు. ప్రైమరీ స్కూల్, హైస్కూల్లో అన్ని రూములను తనిఖీ చేసి అదనంగా ఇంకా ఎన్ని రూములు కావాలని పాఠశాల ఉపాధ్యాయుడు కిషన్ నాయక్‌ను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో వీధులన్నీ తిరుగుతూ ప్రజలతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారానికి తగిన ప్రణాళిక తయారు చేయించి నిధులు మంజూరు చేస్తానన్నారు.
అంతకుముందు ఎమ్మెల్యే నివాస గృహానికి స్థానిక ప్రజలు చేరుకొని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మహాముత్తారం జడ్పీటీసీ లింగమల్ల శారద దుర్గయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ధన్వాడ ఎంపీటీసీ బోడ మమతా నరేష్, సర్పంచ్ చల్ల రాజవ్వ వెంకన్న, ఉపసర్పంచ్ జంగిలి నరేష్, ఎంపీటీసీలు రవీందర్రావు, జాడి మహేశ్వరి, సర్పంచులు అజ్మీర రఘురామ్ నాయక్, రమేష్ రెడ్డి, బొంపల్లి సురేంధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొమ్మన మల్లారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు చీమల సందీప్, కొట్టే శ్రీహరి పాల్గొన్నారు.