- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రోడ్లన్నీ గుంతల మయం.. పట్టించుకోని అధికారులు
దిశ,మన్సూరాబాద్: “ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం” అన్నట్లుగా రహదారులు తయారయ్యాయి. అడుగడుగున గుంతలు వాహనదారుల నడ్డి విరిచేలా కంకర తేలిన గతుకులుతో రహదారులు చినుకు పడితే చాలు కాలువలుగా, చిత్తడి భూములుగా మారిపోతున్నాయి. వాహనదారుల, కాలనీ వాసుల పాలిట ప్రమాదకరంగా మారాయి. ఒకటి కాదు రెండు కాదు కాలనీ మొత్తం ఇదే దుస్థితి.
మూడు సంవత్సరాల నుంచి ఇదే దుస్థితి
గుంతల మయం, బురదమయంగా కాలనీ రహదారులు దారుణంగా ఉన్నాయి. ఓ మోస్తరు వర్షానికే చిత్తడిగా మారిన రోడ్లపై ప్రయాణించడానికి కాలనీవాసులు భయపడుతున్నారు. దుర్వాసన భరించలేక రోగాలతో దోమలతో సతమతమవుతున్నారు.
పట్టించుకోని కాలనీ సంక్షేమ సంఘ నాయకులు
పార్టీల పేరుతో కాలనీ అభివృద్ధిని పక్కన పెట్టేసి గొడవకు దిగిన పరిస్థితి ఉందని, కాలనీవాసులు వాపోతున్నారు. వర్షాకాలం రాకముందే రోడ్లను అభివృద్ధి చేయాల్సి ఉండగా, పార్టీల గొడవలోకి దిగి అభివృద్ధిని పక్కన పడేస్తున్నారని వాపోతున్నారు.
నిలిచిపోయిన పనులు
నిధులు విడుదల కాక రోడ్ల నిర్మాణం పనులు చేపట్టలేక ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లే నాథుడే కరువయ్యారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుర్వాసన భరించలేక, సంవత్సరం పొడవునా బురదలో నడవలేక, కాలనీ వాసులు ఇల్లు అమ్ముకుని, వేరే చోటకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు.
మొక్కుబడిగా అధికారుల పర్యటన
వచ్చినమా.. పోయినమా అన్నట్టే ఉంది జీహెచ్ఎంసీ అధికారుల పరిస్థితి. బురదతో, దోమలతో సతమతమవుతున్నా మని మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.