- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా మనోజ్ సిన్హా
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ నూతన లెఫ్టినెంట్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత మనోజ్ సిన్హా ఎంపికయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వెల్లడించారు. గిరీష్ చంద్ర ముర్ము జమ్ము కశ్మీర్ లెఫ్టినెంగ్ గవర్నర్ పదవికి చేసిన రాజీనామానూ స్వీకరించి ఆమోదించినట్టు ప్రెసిడెంట్ ప్రెస్ సెక్రెటరీ అజయ్ కుమార్ విడుదల చేసిన ఉత్తర్వు పేర్కొంది. ముర్ము స్థానంలో మనోజ్ సిన్హాను ఎంపికచేయడానికి రాష్ట్రపతి సంతోషిస్తున్నారని తెలిపింది.
1989 నుంచి 96 వరకు బీజేపీ నేషనల్ కౌన్సిల్ మెంబర్‌గా కొనసాగిన మనోజ్ సిన్హా లోక్‌సభకు నాలుగు సార్లు ఎన్నికయ్యారు. యూపీకి చెందిన ఈ నేత మోడీ సర్కారు తొలి హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేసి ఏడాది గడిచిన తరుణంలో ఈ మార్పు చోటుచేసుకోవడం గమనార్హం.
బీజేపీ సీనియర్ నేతను కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎంపిక చేయడంపై ఓ రిటైర్డ్ అధికారి మాట్లాడుతూ, కేంద్ర సర్కారు అభిప్రాయాలు, వ్యూహానికి అనుగుణంగానే నిర్ణయాలు జరుగుతాయని పేర్కొన్నారు. కశ్మీర్‌లో రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాలని భావిస్తే అక్కడ నేతలు, పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఉపకరించే వ్యక్తినే ఎంపిక చేయవచ్చు అని అభిప్రాయపడ్డారు.