- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్స్‌కు కిక్ ఇస్తున్న శ్రీలంకన్ సాంగ్
దిశ, ఫీచర్స్ : మ్యూజిక్ విషయానికొస్తే భౌగోళిక సరిహద్దులు లెక్కలోకి రావు. భావం అర్థంకాకపోయినా కేవలం వాయిస్, బీట్‌తోనే ఎన్నో పాటలు వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన దాఖలాలున్నాయి. ముఖ్యంగా మెలోడి సంగీతాన్ని అమితంగా ఇష్టపడే భారతీయులు.. అవి ఫారిన్ లాంగ్వేజ్ సాంగ్స్ అయినా తమ మ్యూజిక్ లిస్ట్‌లో చోటిస్తారు. తాజాగా ‘మనికె మగె హితే’ అనే సాంగ్ కూడా జాబితాలో చేరిపోయింది. వైరల్‌గా మారిన శ్రీలంకన్(సింహళి) సాంగ్.. అమితాబ్ బచ్చన్ నుంచి మాధురి దీక్షిత్ వరకు పలువురి బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ క్యాచీ ట్యూన్‌పై ఇప్పటికే అనేక ప్రాంతీయ భాషల్లో లెక్కలేనన్ని కవర్ సాంగ్స్ కూడా రూపొందించబడ్డాయి.
ఒరిజినల్ సాంగ్‌కు కవర్ వెర్షన్లు..
ప్రస్తుతం శ్రీలంకన్ సింగర్-ర్యాపర్ యొహానీ పాడిన వెర్షన్.. దేశీ ఫ్యాన్స్ మనసు దోచుకుని వైరల్ అవుతోంది. అయితే ఇది కవర్ వెర్షన్ మాత్రమే. ఒరిజినల్ సాంగ్ గతేడాది జులైలో రిలీజ్ కాగా.. ఏడాది తర్వాత సింగర్ యొహాని, ఒరిజినల్ సింగర్ సతీషన్‌తో కవర్ వెర్షన్ పాడించి విడుదల చేశారు. మే నెల చివరలో విడుదలైనప్పటి నుంచే లంకేయుల ఆదరణ పొందిన సాంగ్.. భారత్‌లో స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ చార్ట్స్‌లో టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఇప్పుడు యూట్యూబ్‌లోనూ 100 మిలియన్‌కు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది. దీంతో తమిళ్, మలయాళ హిందీ వెర్షన్ కూడా రిలీజ్ చేయగా.. హిందీలో ఇండియన్ సింగర్-ర్యాపర్ ముజిస్తార్, యొహానీతో కలిసి ఆలపించడం విశేషం.
https://youtu.be/g66Dz2W13Mg
ఇండియన్స్‌లో ‘మణికే మగే హితే’ ఫీవర్..
మొదట సోషల్ మీడియా స్టార్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ యశ్‌రాజ్ ముఖతే.. ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన కవర్ వెర్షన్‌కు 15 మిలియన్‌కు పైగా వ్యూస్ పొందింది. కొన్నిరోజుల తర్వాత బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్.. ఈ సాంగ్ హిందీ వెర్షన్ మ్యూజిక్ బీట్‌కు కాలు కదిపినట్లుగా స్పూఫ్ వీడియో చేశారు. ఇదే క్రమంలో టీవీ స్టార్స్ నుంచి సింగర్స్, నటులు ఇతర సెలబ్రిటీలు ఈ పాటతో ఏదో విధంగా కనెక్ట్ అవుతున్నారు. కాగా ఈ పాటకు టైగర్ ష్రాఫ్ చేసిన డాన్స్ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 22 మిలియన్ వ్యూస్ సంపాదించింది. సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ఈ పాటతో ‘ప్రేమలో’ పడ్డానని ఒక లుక్ వీడియోను షేర్ చేసింది. తాజాగా ఖాళీ విమానంలో ఒక ఎయిర్ హోస్టెస్ ‘మణికె మగే హితె’కు డ్యాన్స్ చేస్తున్న వీడియో 40 మిలియన్ వ్యూస్ పొందింది.