- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘దిగు దిగు దిగు నాగ’ కాంట్రవర్సీ: మంగ్లీ పాడితే తప్పు.. థమన్ వాయిస్తే ఒప్పా?
దిశ, సినిమా : కాంట్రవర్సీ క్రియేట్ చేయాలనుకుంటే.. ఫలానా మనుషులను మాత్రమే ఎంచుకుంటారా? లేక సబ్జెక్ట్‌ను బట్టి విమర్శలకు దిగుతారా? అనేది అర్థం కావడం లేదు. పాపం సింగర్ మంగ్లీ కష్టపడి అషాఢమాస బోనాలకు స్పెషల్ సాంగ్‌తో వస్తే.. ఆమె సక్సెస్‌ను చూసి ఓర్వలేని ఓ గ్రూప్.. దేవుడిని తిడుతూ పాట ఎలా రిలీజ్ చేస్తావ్? ఎంత ధైర్యముంటే మా కులదైవం గురించి బూతులు మాట్లాడుతావ్? అంటూ ఆడుకున్నారు. సరేలే మనోభావాలు దెబ్బతీశామేమో అనుకుని వెనక్కి తగ్గి.. లిరిక్స్ చేంజ్ చేసి పాట రీరిలీజ్ చేస్తే.. అది కూడా ఒప్పుకోలేదు. ఫైనల్‌గా పాటను యూట్యూబ్ నుంచి రిమూవ్ చేసేవరకు పట్టుబట్టారు. సర్లే ఇది కూడా ఓకే అనుకుందాం.
నిజంగానే వారి మనోభావాలు దెబ్బతిన్నాయని అనుకుంటే.. ఎస్ఎస్ థమన్ సంగీత సారథ్యంలో ‘వరుడు కావలెను’ సినిమా పాట గురించి ఈ గ్రూప్ ఎందుకు రియాక్ట్ కాలేదని అడుగుతున్నారు మంగ్లీ ఫ్యాన్స్. ‘దిగు దిగు దిగు నాగ’ అనే దేవుడి పాటను.. ‘ప్రియుడిని రమ్మంటూ’ ఐటెమ్ సాంగ్‌గా కంపోజ్ చేస్తే ఎందుకు నోరు మెదపడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. మంగ్లీకి ఒక న్యాయం.. థమన్‌కు మరో న్యాయమా? మంగ్లీకి అయితే బడాబాబుల సపోర్ట్ లేదు కాబట్టి మనోభావాలకు తలొగ్గుతుంది..? అదే థమన్ అయితే అవసరం లేదు అనుకుంటున్నారా? అని అడుగుతున్నారు. థమన్ వెనక పెద్ద బ్యానర్.. పలుకుబడి ఉన్న హీరోహీరోయిన్లు ఉన్నారని ఫీల్ అవుతున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
మరి ఆ పాటన్న అంత ఇంప్రెసివ్‌గా ఉందా అంటే అదీ లేదు. ఎప్పుడూ కాపీ కొడుతూనే పాసయ్యే థమన్.. ఈ సారి ఆ కాపీ కూడా సరిగ్గా కొట్టలేకపోయాడు. ఇక రీతూ వర్మ ఫస్ట్ టైమ్ డ్యాన్స్ చేసింది అనుకుంటా. స్కూల్ పిల్లలు స్టేజ్‌పై స్టెప్పులేసినట్లు.. ఏదో చేశామా అంటే చేశాం అన్నట్లుగా ఆడింది. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అంటారా.. పాటలోనే పస లేదు పాపం ఆయన మాత్రం ఏం చేస్తాడు? అంటూ నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.