పంతానికి పోయి పరువు పోగొట్టుకుంది

by srinivas |   ( Updated:2020-08-01 06:12:58.0  )
పంతానికి పోయి పరువు పోగొట్టుకుంది
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మూడు రాజధానుల అంశంపై టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్ స్పందించారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వం మాత్రం సిగ్గుఎగ్గు లేకుండా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మూడు రాజధానుల అంశం న్యాయ సమీక్షకు నిలవదు అని అన్నారు.

తాను చెప్పిందే వేదం అన్నట్లు ప్రభుత్వ తీరు ఉందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ విషయంలో ప్రభుత్వం పంతానికి పోయి పరువు పోగొట్టుకుందని ఎద్దేవా చేశారు. అవనిగడ్డలో భారీ ఎత్తున్న ఇసుక, మట్టి దోపిడీ జరుగుతున్న అధికారులు చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

Advertisement

Next Story