గిరిజన కుటుంబాలకు న్యాయం చేయండి

by Shyam |   ( Updated:2020-08-09 08:12:50.0  )
గిరిజన కుటుంబాలకు న్యాయం చేయండి
X

దిశ, బాన్సువాడ: బాన్సువాడ మండలంలోని హన్మాజిపేట్ పంచాయతీ చత్రునాయక్ తండాలో అన్యాయానికి గురైన గిరిజన కుటుంబాలకు న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యస్థాపకులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బాన్సువాడ మండలంలోని చత్రు నాయక్ తండాలో గిరిజనులకు జరిగిన అన్నాయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని, ఆదివారం బాధితులను పరామర్శించారు. అనంతరం అటవీశాఖ అధికారులు బాధితులపై జరిగిన దాడిపై తీవ్రంగా ఖండించారు.

గత కొన్నేండ్లుగా భూమి గిరిజనుల స్వాధీనంలో ఉందన్నారు. గత రెండ్రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సంబంధించిత భూములపై దాడులు చేశారన్నారు. అటవీభూములపై గిరిజనులకు హక్కు ఉంటుందన్నారు. అయినా అధికారులు హక్కు ఉన్నవారికి సమాచారం ఇవ్వాలని, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పెట్టుబడులు పెట్టి పంటలు వేసుకున్న రైతులపై దాడులు జరిపి అన్యాయం చేశారన్నారు. ఈ విషయమై బాధితులకు న్యాయం జరిగేవరకు పోరాడతామన్నారు.

Advertisement

Next Story