ఆయనకు చేసిన మెసేజ్ బయట పెట్టిన మంచు విష్ణు

by Shyam |
ఆయనకు చేసిన మెసేజ్ బయట పెట్టిన మంచు విష్ణు
X

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రకాశ్ రాజ్ ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. ప్రకాశ్‌ రాజ్‌ భావోద్వేగానికి లోనుకావద్దని, ఎన్నికలన్నాక గెలుపోటములు సహజమేనని వ్యాఖ్యానించారు. ప్రకాశ్ రాజ్ నిర్ణయం సరికాదని, ఆయన మా కుటుంబంలో ఒక భాగమని విష్ణు అన్నారు. ఆయన రాజీనామా నిర్ణయంపై సంతోషంగా లేనని I LOVE U అంకుల్ అని ప్రకాశ్ రాజ్‌కు చేసిన మెసేజ్‌ని ట్వీట్ చేశారు. మా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, ప్రకాశ్ రాజ్‌తో కలిసి పనిచేస్తామని విష్ణు వెల్లడించారు. ప్రకాశ్ రాజ్‌ని కలిసి నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరుతామని చెప్పారు.

Advertisement

Next Story