చులకనైపోయామా..? యూట్యూబ్ చానెల్స్‌ను రప్ఫాడిస్తా : మంచు విష్ణు

by Shyam |
చులకనైపోయామా..? యూట్యూబ్ చానెల్స్‌ను రప్ఫాడిస్తా : మంచు విష్ణు
X

దిశ, సినిమా : మా అధ్యక్షుడు మంచు విష్ణు యూట్యూబ్ చానెల్స్‌కు వార్నింగ్ ఇచ్చాడు. హీరోయిన్స్ గురించి పోస్ట్ చేసిన న్యూస్ అసభ్యకరంగా ఉన్నా… థంబ్ నెయిల్స్‌లో మసాలా యాడ్ చేసినా.. ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఫిమేల్ ఆర్టిస్టులను ఆడపడుచులుగా అభివర్ణించిన ఆయన.. వారిని గౌరవించడం మన బాధ్యత అన్నారు. థంబ్ నెయిల్స్ లిమిట్స్ క్రాస్ అయితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్న ఆయన… ఇందుకోసం ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇకపై థంబ్ నెయిల్స్ పెట్టేటప్పుడు కాస్తా ఆలోచిస్తే మంచిదని, హీరోయిన్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అంతేకాదు ఈ విషయంలో యూట్యూబ్ చానెల్స్ నియంత్రణ తన ఎజెండా అని చెప్పుకొచ్చారు మంచు విష్ణు. కాగా, ఫిల్మ్ చాంబర్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ సన్మాన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు విష్ణు.

Advertisement

Next Story

Most Viewed