- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ, వెబ్‌డెస్క్: హీరో మంచు మనోజ్ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారు. అభిమానుల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటారు. తప్పును తప్పుగా ఎత్తి చూపుతూనే… మంచి పని చేస్తే ప్రశంసలు కురిపిస్తాడు. కానీ కొన్ని కారణాల వల్ల మనోజ్ సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. వాటన్నింటి నుంచి కోలుకుని కొత్తగా మళ్లీ సినీ కళామతల్లి ఒడిని చేరుదామని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంఎంఆర్ట్స్ పేరుతో సొంత నిర్మాణ సంస్థ ప్రారంభించిన మనోజ్… ఈ సంస్థ నిర్మాణంలోనే తానే హీరోగా “అహం బ్రహ్మాస్మి ” చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేశారు. సినిమా ఫస్ట్ లుక్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది కూడా . కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ క్రమంలో ఓ పోస్ట్ పెట్టారు మనోజ్.
“మూడు సంవత్సరాల విరామం తర్వాత మంచి సినిమాతో మిమ్మల్ని పలుకరిద్దాం అనుకున్నాను. మనమంతా ఒక స్క్రిప్ట్ రాసుకుంటే దేవుడు మరొక స్క్రిప్ట్ రాస్తాడు. “యాక్షన్” అన్న పదం వినే అదృష్టాన్ని ఇంకొన్ని రోజులు దూరం జరిపాడు. వచ్చే వారం డాక్టర్లకు, పోలీసులకు, ఆర్మీకి, పారిశుధ్య కార్మికులకు, ముఖ్యంగా వాళ్ళు చేసే త్యాగానికి ఒక పాట అంకితం చేస్తున్నాను. అచ్చు రాజమణి మ్యూజిక్ డైరెక్షన్లో “అంతా బాగుంటాంరా” అని నేను, నా మేనకొడలు విద్య నిర్వాణ కలిసి పాడి, పాట రూపంలో ఇస్తున్న చిన్న భరోసా ఇది.ఇప్పటికే చాలా వాటికోసం ఎదురు చూస్తున్నారు. కష్టం అయినా వచ్చే వారం వరకూ అగండి” అని అభిమానులను కోరాడు మనోజ్.
కాగా ఎంఎంఆర్ట్స్ బ్యానర్ నుంచి తొలిసారి వీడియో రిలీజ్ అయింది విద్యా నిర్వాణదే కావడం విశేషం. మహా శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేస్తూ… విద్యా నిర్వాణ పాడిన “అయిగిరి నందిని” పాట విమర్శకులను సైతం మెప్పించింది. ఇప్పుడు మామ మంచు మనోజ్ తో కలిసి ” అంతా బాగుంటాంరా ” సాంగ్ తో రాబోతోంది కోడలు విద్యా నిర్వాణ.
Tags: Manchu Manoj, Vidya Nirvana, MMArts, Antha Bagunnara