మానవత్వం చాటుకున్న పోలీసులు.. గర్భిణీకి సాయం

by Sridhar Babu |
Mancherial police
X

దిశ, మంచిర్యాల: లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంటికి వెళ్లేందుకు వాహన సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న ఒక నిండు గర్భిణీకి సాయం చేసి, మంచిర్యాల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మంచిర్యాల జిల్లా కాగజ్ నగర్‌కు చెందిన ఒక గర్భిణి వైద్య పరీక్షల కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. లాక్‌డౌన్ నేపథ్యంలో టెస్టుల అనంతరం తిరిగి కాగజ్ నగర్‌కు వెళ్లేందుకు వాహనాలు లేక బస్టాండ్‌లో కూర్చుంది. ఆమెను గమనించిన పోలీసులు వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఆమెను బెల్లంపల్లి చౌరస్తాకు తీసుకొచ్చి, ఓ ఆటో మాట్లాడి అందులో పంపించారు. ఆపద సమయంలో తమను గమ్య స్థానానికి చేర్చిన సీసీసీ ఎస్ఐ యాకుబ్ అలీ, కానిస్టేబుల్స్ గంగాధరి సత్యనారాయణ, శ్రీనివాస్‌లకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

Next Story

Most Viewed