బాలికపై 'పీటర్ పాన్ సిండ్రోమ్' రోగి అత్యాచారం.. సంచలనంగా కోర్టు నిర్ణయం

by Anukaran |   ( Updated:2021-06-23 06:33:53.0  )
Peter Pan Syndrome case
X

దిశ, వెబ్‌డెస్క్: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి ముంబై కోర్టు బెయిల్ మంజూరు చేసింది. పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన నిందితుడు అరుదైన జబ్బుతో బాధపడుతున్నాడన్న లాయర్ వాదనను అంగికరించి కోర్ట్ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ఆదేశాలు జారీచేసింది. ఇంతకీ ఆ నిందితుడికి ఉన్న అరుదైన వ్యాధి ఏంటంటే.. ‘పీటర్ పాన్ సిండ్రోమ్’. వివరాలలోకి వెళితే.. ఈ ఏడాది ఏప్రిల్ లో ఓ 23 ఏళ్ల వ్యక్తి 14 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను పెళ్లిచేసుకున్నాడు. అయితే బాలిక తల్లిదండ్రులు వారి వివాహాన్ని అంగీకరించకుండా అతడిపై పోలీస్ కేసు పెట్టారు. దీంతో ఈ కేసు విచారణ ముంబై కోర్టులో నడుస్తోంది. ఇక ఈ కేసుకు సంబంధించి నిందితుడి తరపు న్యాయవాది బెయిల్ మంజూరు చేయవల్సిదింగా కోరాడు.

“తన క్లయింట్ ‘పీటర్ పాన్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతున్నాడని, అది బాలిక తల్లిదండ్రులకు తెలుసని తెలిపాడు. అంతేకాకుండా తన క్లయింట్ పేదవాడని ఈ పెళ్లి చెల్లకూడదని కేసు పెట్టారని, బాలికను కిడ్నాప్ చేయలేదని, ఆమె ఇష్ట ప్రకారమే పెళ్లి జరిగిందని” వాదించారు. వాదోపవాదనలు విన్న కోర్ట్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. పైగా నిందితుడికి ఎటువంటి క్రిమినల్ రికార్డ్‌ లేదని, అతన్ని కస్టడీలో ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదని కోర్టు తెలిపింది.

‘పీటర్ పాన్ సిండ్రోమ్’ అంటే..

పీటర్ పాన్ సిండ్రోమ్ అంటే మానసికంగా ఎదగకపోవడం.. ఎంత వయసు వచ్చినా బాధ్యతలు తెలుసుకోకపోవడం. వీరికి మానసిక ఎదుగుదల ఉండదు. చిన్న పిల్లల్లానే వీరి లక్షణాలు ఉంటాయి. పీటర్ పాన్ అనేది నెవర్-నెవర్ ల్యాండ్ అనే పౌరాణిక ప్రదేశం నుంచి వచ్చిన కల్పిత పాత్ర అని చాలా పుస్తకాల్లో రాసి ఉంది. ఇక ఈ వ్యాధి ఉన్నవారు యుక్త వయసులో పరిపక్వత కలిగి ఉండరు. అందరికంటే కొంచెం భిన్నంగా ఉంటారు. కాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనిని మానసిక రుగ్మతగా గుర్తించలేదు. 1983 లో ప్రచురించబడిన “పీటర్ పాన్ సిండ్రోమ్: మెన్ హూ హావ్ నెవర్ గ్రోన్ అప్” అనే పుస్తకంలో దీనిని మొదటిసారి డాక్టర్ డాన్ కిలే తెలిపారు.
Advertisement

Next Story