- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కళ్లముందు విలవిలలాడుతున్నా.. పట్టించుకోలేదు
దిశ, మెదక్: ప్రపంచ దేశాలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి మానవత్వం మంటగలిసేలా చేసింది. కండ్లముందే గంటసేపు ఒక మనిషి ప్రాణాల కోసం విలవిలలాడుతున్నా ఒక్కరు కూడా దగ్గరకి వెళ్లలేదు. ఈ హృదయవిదారక సంఘటన సిద్దిపేట జిల్లా చేగుంట మండంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. రామాయంపేట నుంచి సికింద్రాబాద్‌కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న శ్రీనివాస్ బాబు(50) శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. బస్సు చేగుంట ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోకి రాగానే దిగి అక్కడే కుప్ప కూలి పడిపోయాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో అతని వద్దకు ఎవరూ వెళ్లలేదు. దీంతో శ్రీనివాస్ బాబు అక్కడే విలవిల్లాడుతూ మృతిచెందాడు. మృతుడికి కరోనా లక్షణాలు ఉండవచ్చనే అనుమానంతో బస్సులోంచి దింపేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని తరలించేందుకు 108 అంబులెన్స్ వచ్చినా తీసుకెళ్లేందుకు నిరాకరించారు. నేరెడ్‌మెట్‌కు చెందిన శ్రీనివాస్ బాబు బంధువులకు సమాచారం అందిస్తే ఆయనకు ఆస్తమా ఉందని అప్పుడప్పుడూ సమస్యతో బాధపడుతున్నాడని వివరించారు. మృతుడి బంధువులు ఘటనా స్థలానికి వచ్చాక ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది మృతదేహాన్ని పంపించారు.