- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crimenews in Ongole : నీ లవర్‌తో గడిపిన ఫోటోలు ఉన్నాయి.. బయట పెడతా అని యువతిపై అఘాయిత్యం
దిశ, వెబ్‌డెస్క్: ప్రేమికులు అన్నాక బయట చెట్టాపట్టాలేసుకొని తిరగడం సాధారణం. ప్రేమించిన వారి చేయి పట్టుకొని పార్కుల వెంట తిరుగుతూ కబుర్లు చెప్పుకొంటూ సమయాన్ని గడుపుతుంటారు. కానీ అలాంటి సమయాలలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు ప్రాణాల మీదకు తెస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. తాజాగా ప్రేమికుడి తో బయట తిరుగుతున్న ఓ యువతిని సీక్రెట్ గా ఫోటోలు తీసి, బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే..
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ యువతి శుక్రవారం ప్రియుడితో కలిసి బైక్ పై బయటకు వెళ్లింది. ఎవరు లేని ప్రాంతంలో వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుంటున్న సమయంలో వారిని ఓకే వ్యక్తి గమనిస్తూ వచ్చాడు. వెనకనుండి యువతి కనిపించే విధంగా వారి ఫోటోలను రహస్యంగా తీయడం మొదలుపెట్టాడు. కొద్దిసేపు ప్రియుడితో ముచ్చట్లాడిన యువతి ఇంటికి బయల్దేరింది. మార్గమధ్యంలో యువతిని అడ్డుకున్న వ్యక్తి ఆమె ఫోటోలను చూపించి బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఈ ఫోటోలను మీ ఇంట్లో వారికి చూపిస్తానని బెదిరించాడు.
అందుకు యువతి తానే తప్పు చేయలేదని, చూపించిన పర్లేదని చెప్పడంతో ఖంగుతిన్న వ్యక్తి మరో ప్లాన్ వేశాడు. తాను పోలీస్ నని, ఎస్సై గారు నిన్ను పిలుచుకురమ్మన్నారని నమ్మబలికాడు. దీంతో భయపడిన సదరు యువతి అతని బండెక్కింది. దీంతో అతను యువతిని ఎవరూలేని నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం అక్కడినుండి పరారయ్యాడు. కాసేపటి తర్వాత తేరుకున్న బాధితురాలు జరిగిన ఘోరాన్ని తన స్నేహితులకు చెప్పింది. వారి సాయంతో ఒంగోలు దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
Ongole : Man Raped young Girl in Prakasam
- Tags
- rape