తట్టుకోలేక బాత్రూమ్‌లోకి వెళ్లి కేకలు వేసిన భార్య.. కిటికిలోంచి చూసి షాకైన పక్కింటివాళ్లు

by Sumithra |   ( Updated:2021-12-18 23:00:17.0  )
house-window1
X

దిశ, వెబ్ డెస్క్: కుటుంబ కలహాలతో భార్యపై భర్త కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్ గఢ్ లోని భిలాయ్ ఫరీద్ నగర్ లో సాజిద్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. కొన్నాళ్లవరకు వీరి కాపురం సాఫీగా సాగింది. అయితే, ఈ మధ్య తన భార్యపై అతను అనుమానం పెంచుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య ప్రతిరోజూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. గురువారం కూడా అతను ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి రాగానే తన భార్యతో గొడవపడ్డాడు. అంతటితో ఆగకుండా భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. మంటలకు తట్టుకోలేక ఇంట్లోని బాత్రూమ్ లోకి వెళ్లి కాపాడాలంటూ ఆమె కేకలు వేసింది. ఆ కేకలను విన్న పక్కింటివాళ్లు కిటికిలోంచి చూసి అక్కడికి వెళ్లి ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లుగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని భర్తను అరెస్ట్ చేసినట్లు సమాచారం.

Advertisement

Next Story