రైలు కిందపడి వ్యక్తి దుర్మరణం

by  |
రైలు కిందపడి వ్యక్తి దుర్మరణం
X

దిశ, చిట్యాల: చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని శివనేని గూడెంకు చెందిన నాగిళ్ల సురేష్ (34) అనే వ్యక్తి రైలు కిందపడి శనివారం బలవన్మరణం చెందాడు. తెలిసిన వివరాల ప్రకారం మృతుడు గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో మానసిక క్షోభకు గురై శనివారం సాయంత్రం పట్టణ కేంద్రంలోని భువనగిరి రోడ్డు వైపు ఉన్న రైల్వే ట్రాక్ పై మృతి చెందాడు. మృతునికి భార్య, బాబు ఉన్నారు. నల్గొండ రైల్వే పోలీసులు సమాచారం తెలుసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed