గోదావరిలో పడి వ్యక్తి మృతి

by Sridhar Babu |
గోదావరిలో పడి వ్యక్తి మృతి
X

దిశ, ధర్మపురి: ప్రమాదవశాత్తు ధర్మపురి గోదావరిలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన తోకల ఆనంద్ అనే వ్యక్తి సోమవారం కుటుంబసభ్యులతో కలిసి గోదావరి స్నానానికి జగిత్యాల జిల్లాలోని ధర్మపురికి వచ్చారు. ఈ క్రమంలో మంగలి ఘాట్ వద్ద స్నానాలు చేస్తుండగా ఆనంద్ ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు గజఈతగాళ్లతో గాలించగా.. ఆనంద్ మృతదేహం లభ్యమైనట్లు ఎస్ఐ కిరణ్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story