మునుగోడులో కరోనాతో వ్యక్తి మృతి

by vinod kumar |
మునుగోడులో కరోనాతో వ్యక్తి మృతి
X

దిశ, మునుగోడు: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్యలు పెరుగుతూ, విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. అంతేగాకుండా ఈ వైరస్ మూలంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. తాజాగా నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఆదివారం మృతిచెందాడు. వివరాళ్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గతవారం తీవ్ర జ్వరంతో ఇబ్బంది పడుతూ, హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ సదరు వ్యక్తి ఆరోగ్య స్థితిని పరీక్షించిన వైద్యులు కొవిడ్ టెస్టులు చేశారు. అనంతరం వచ్చిన రిపోర్టుల ఆధారంగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారించారు. దీంతో చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి బాధితున్ని తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు.

Advertisement

Next Story