కాళేశ్వరం కాల్వ సమీపంలో ప్రమాదం

by Shyam |
కాళేశ్వరం కాల్వ సమీపంలో ప్రమాదం
X

దిశ, గజ్వేల్: జగదేవ్‌పూర్ మండలం గొల్లపల్లి రోడ్డులో నిర్మిస్తున్న కాళేశ్వరం కాల్వ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం సాయంత్రం టాటాఏస్ వాహనం, బైక్‌ ఢీకొనడంతో ఇటిక్యాల గ్రామానికి చెందిన భిక్షపతి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. చనిపోయిన వ్యక్తి జామకాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని స్థానికులు వెల్లడించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story