విషాదం.. ఉపవాసం ప్రాణం తీసింది..

by srinivas |
విషాదం.. ఉపవాసం ప్రాణం తీసింది..
X

దిశ, మంగపేట : శివరాత్రి పండుగ ఆ కుటుంబంలో విషాదం నింపింది. ఇంటి దైవంగా భావించే శివునిపై ప్రేమతో కుటుంబమంతా కోటప్పకొండకు వెళ్లి ఉపవాసం ఉన్నా.. కుటుంబ పెద్దను కాపాడుకోలేకపోయారు. వివరాల్లోకి వెలితే మండలంలోని నర్సాపురం బోరు గ్రామానికి చెందిన కాండ్రు శ్రీనివాస్ (50) శివభక్తుడు. శుక్రవారం శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకోని ఉపవాసం ఉండి కుటుంబ సభ్యులతో కలిసి కోటప్పకొండకు వెళ్లి శివున్ని దర్శించుకోని తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. ఉదయం 10 గంటలకు ఇంటి నుండి షాపునకు బైకుపై వెళ్తున్న క్రమంలో ఇంటికి దగ్గరలో.. కరెంటు స్థంబానికి ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.

శివరాత్రి ఉపవాసం ఉండడంతోనే షుగర్ లెవల్స్ తగ్గి కళ్లు కనిపించక ఎదురుగా ఉన్న స్థంబాన్ని ఢీకొట్టడంతోనే శ్రీనివాసరావు మృతి చెంది ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతునికి భార్య శారద, కొడుకు ఉన్నారు. కొడుకు ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాసరావు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా పార్టీ అధ్యక్షుడు నల్లెల కుమార్‌లు హుటాహుటిన నర్సాపురం బోరు చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన జరిగిన తీరుపై ధిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed