గొంతుకోసుకున్న వ్యక్తి.. పోలీసులు, కుటుంబానిదో కథనం

by srinivas |

తూర్పుగోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల సాక్షిగా వ్యక్తి గొంతు కోసుకుని దారుణానికి పాల్పడితే.. దానికి కారణం పోలీసులని కుటుంబ సభ్యులంటే.. కాదు కుటుంబ సభ్యుల వల్లే గొంతుకోసుకున్నాడంటూ పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..

తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం మేడపాడుకు చెందిన లోవరాజు బైక్‌పై వెళ్తుండగా జగ్గంపేటలో లాక్‌డౌన్ విధుల్లో ఉన్న పోలీసులు అతడిని అడ్డుకున్నారు. దీంతో మనస్తాపం చెందిన లోవరాజు వెంటనే బ్లేడుతో పీక కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకున్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

దీనిపై బాధితుడి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, పోలీసులు దురుసుగా ప్రవర్తించడానికి తోడు, దుర్భాషలాడడంతో దారుణానికి పాల్పడ్డాడని, దీనికి పోలీసులే కారణమని ఆరోపిస్తుండగా… పోలీసులు, లోవరాజు కుటుంబ కలహాల నేపథ్యంలో మద్యం మత్తులో గొంతు కోసుకున్నాడంటున్నారు. అయితే గొంతు కోసుకునేందుకు జగ్గంపేట వరకు రావాల్సిన అవసరం ఉందా? అని కుటుంబ సభ్యులంటే.. ఆత్మహత్యకు పాల్పడేవారికి స్థలంతో సంబంధం ఉండదని పోలీసులు చెబుతున్నారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

Tags: east godavari district, suicide attempt, lockdown, police check post

Advertisement

Next Story

Most Viewed