కామారెడ్డిలో వ్యక్తి సజీవ దహనం

by Anukaran |
కామారెడ్డిలో వ్యక్తి సజీవ దహనం
X

దిశ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గుమస్తాకాలనీ శివారులో దారుణం జరిగింది. పాషా అనే వ్యక్తిని అతని తోడల్లుడు, కుటుంబీకులే పెట్రోల్ పోసి సజీవదహనం చేశారు. మంగళవారం ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది.

సోమవారం పాషాతో కలిసి వీళ్లంతా కల్లు సేవించారు. స్థానికంగా ఉన్న ఓ రేషన్ దుకాణంలో పాషా కూలీగా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి కుటుంబీకులు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. కుటుంబ కలహాలే హత్యకు కారణం అని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story