- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అర్ధరాత్రి వ్యక్తి దారుణ హత్య.. ఆ గొడవే కారణమా..?
దిశ,పెద్దపల్లి : జిల్లాలోని రాఘవపూర్, రంగాపూర్ శివారులో హత్య కలకలం రేపింది. గ్రామంలోని పంచరు షాపు యజమాని బీహార్ రాష్ట్రం మహువ జిల్లాకు చెందిన ముకేష్ కుమార్ దారుణ హత్యకు గురయ్యాడు. షాపులో పనిచేస్తున్న బీహార్‌కు చెందిన చందన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో లారీ డ్రైవర్ గాలి కొట్టించుకునేందుకు వచ్చిన సందర్భంలో యజమాని ముఖేష్ కుమార్‌తో గొడవపడి వెళ్లిపోయాడని తెలిపాడు.
అనంతరం గంట వ్యవధిలో ఒక కారులో నలుగురు వ్యక్తులు వచ్చి ముఖేష్‌పై కారం చల్లి బండరాయితో తలపై మోది హత్య చేసినట్లు వివరించాడు. స్థానికులు పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వగా బసంత నగర్ ఎస్ఐ మహేందర్ ఘటనా స్థలాన్ని పరిశీలించి. పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐకి సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించినట్టు తెలిపారు.