- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య..
దిశ, చార్మినార్ : హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీహాలం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఓ కాంప్లెక్స్‌లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. పాతబస్తీ శాలిబండ పాత ఆశా థియేటర్ ప్రాంగణంలో నూతన కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శనివారం ఆ నిర్మాణంలో ఉన్న కాంప్లెక్స్‌లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడన్న సమాచారం మేరకు దక్షిణ మండలం డీసీపీ గజరావు భూపాల్, చార్మినార్ ఇంచార్జీ ఏసీపీ భిక్షం రెడ్డి, హుస్సేనీహాలం ఇన్‌స్పెక్టర్ నరేష్, కాలాపత్తర్ ఇన్‌స్పెక్టర్ సుదర్శన్‌లు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
శవ పంచనామ నిర్వహించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు బహదూర్‌పురాకు చెందిన సయ్యద్ జుబేర్(23) గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం రాత్రి తన స్నేహితులతో కలిసి శాలిబండకు వచ్చిన జుబేర్.. హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును హుస్సేనీహాలం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.