కరోనా వస్తుందనే భయంతో ఆత్మహత్య

by srinivas |   ( Updated:2020-08-10 05:17:20.0  )
కరోనా వస్తుందనే భయంతో ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉంది. దీంతో కరోనా సోకుతుందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు. కాకినాడ సంజయ్ నగర్ కు చెందిన 50 ఏళ్ళ అనుసూరి అన్నవరం లారీ డ్రైవర్. అతనికి భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

అన్నవరం తనకు కరోనా సోకుతుందనే భయంతో ఈ నెల 8 న కరప మండలం నడకుదురు శివార్లలో పురుగుల మందు సేవించాడు. గమనించిన స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచాడు.

Advertisement

Next Story

Most Viewed