అనూహ్య పరిణామం.. ఓడిన మమత

by Anukaran |   ( Updated:2021-05-02 07:38:51.0  )
అనూహ్య పరిణామం.. ఓడిన మమత
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సీఎం మమతా బెనర్జీ ఓటమి చెందడం చర్చనీయాంశమైంది. నందిగ్రామ్‌లో మమతాపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 1622 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. తృణమూల్ కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలవగా.. సీఎం మమత ఓడిపోవడం విశేషంగా మారింది.

నందిగ్రామ్‌లో ఓటమిపై మమతా స్పందించారు. ‘నందిగ్రామ్ గురించి నేను బాధ పడటం లేదు. నందిగ్రామ్ ప్రజల తీర్పును గౌరవిస్తున్నా. అక్కడ బీజేపీ ప్రతినిధిలా ఈసీ పనిచేసింది. నేను నందిగ్రామ్‌లో ఓడినా.. 221 సీట్లు గెలుచుకున్నాం.. బెంగాల్‌లో టీఎంసీ గెలుపు దేశ ప్రజల గెలుపు’ అని మమతా వ్యాఖ్యానించారు.

తొలుత నందిగ్రామ్‌లో మమత గెలిచినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత వెబ్ సైట్‌లో టెక్నికల్ ప్రాబ్లం రావడం వల్ల అలా జరిగిందని, బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు ఈసీ ప్రకటించింది. నందిగ్రామ్ ఫలితాలు ఉదయం నుంచి ఉత్కంఠగా సాగాయి. ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌ను తలపించేలా పోటీపోటీగా ఫలితాలు సాగాయి.

Advertisement

Next Story

Most Viewed