ఆయన గెలుపుపై అనుమానం.. హైకోర్టును ఆశ్రయించిన సీఎం..

by Shamantha N |
Mamatha Benerji and Suvendu Adikari
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో టీఎంసీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని చవిచూసారు. అయితే ఓట్ల లెక్కింపు రోజున మొదట మమతా బెనర్జీ విజయం సాధించారని అధికారులు ప్రకటించగా.. మరికొద్దిసేపటికే బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి నందిగ్రామ్‌లో విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.

ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. నందిగ్రామ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. నందిగ్రామ్‌లో సువేందు అధికారి అక్రమంగా గెలిచారని మమత పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అవకతవకలు జరిగి ఉండవచ్చునన్న అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తన పిటిషన్‌లో వెల్లడించారు. పిటిషన్‌‌ను స్వీకరించిన హైకోర్టు.. విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed